Kirana Hills: అణు కేంద్రం ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు.. కిరానా హిల్స్ పై ఏకే భారతి వ్యాఖ్యలు

by Shamantha N |

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పాల్పడిన సైనిక దాడులను భారత సాయుధాలు తిప్పుకొట్టాయి. అ

Kirana Hills: అణు కేంద్రం ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు.. కిరానా హిల్స్ పై ఏకే భారతి వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పాల్పడిన సైనిక దాడులను భారత సాయుధాలు తిప్పుకొట్టాయి. అంతేకాకుండా, పాక్‌లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సర్గోధలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్‌ వే అనుసంధానంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. కాగా.. పాక్ అణుకేంద్రంపైనా భారత్ దాడి చేసినట్లుమీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, సోమవారం రక్షణ అధికారులు మీడియా సమావేశం సందర్భంగా ఒక జర్నలిస్ట్‌ ఈ ప్రశ్నను లేవనెత్తారు. కిరానా హిల్స్‌లోని పాకిస్థాన్‌ అణు కేంద్రంపై భారత్‌ దాడి చేసిందా? అని అడిగారు. దీనిపై, ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కిరాని హిల్స్ పై దాడి చేయలేదన్ననారు.ఆయన మాట్లాడుతూ.. ‘కిరానా హిల్స్‌లో అణు కేంద్రం ఉన్నదని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. అక్కడ ఏమి ఉన్నప్పటికీ కిరానా హిల్స్‌పై మేం దాడి చేయలేదు’ అని అన్నారు.

కిరానా హిల్స్

కిరానా హిల్స్ పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ రిజర్వేషన్‌గా ప్రసిద్ధి చెందింది. పర్వతాల్లోనే ఏర్పాటు అయిన గుహలు పాక్ సైన్యం తన అణువార్ హెడ్ ని నిల్వచేసే ప్రదేశాల్లో ఒకటని నమ్ముతారు. అయితే, ఆ హిల్స్ ఆన్ లైన్ మ్యాప్ ని పరిశీలిస్తే గోధుమ, ఆకుపచ్చ రంగుల నిర్మాణపనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆ కొండలు ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నాయి. ఇది సర్గోధా వైమానిక స్థావరం నుండి రోడ్డు మార్గంలో కేవలం 20 కి.మీ ఉండగా.. కుషాబ్ అణు కర్మాగారానికి 75 కి.మీ దూరంలో ఉంది. కిరానా హిలస్ భూగర్భ అణు మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధఇ చెందిన అత్యంత బలమైన సైనిక జోన్ అని పలువురు నిపుణులు పేర్కొన్నారు.

Next Story