ఉగ్రదాడిని ‘యాక్ట్ ఆఫ్ వార్’గా పరిగణిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన హెచ్చరిక

by Kema Shiva Kumar |

పాకిస్థాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయవంతంగా ముగిసింది.

ఉగ్రదాడిని ‘యాక్ట్ ఆఫ్ వార్’గా పరిగణిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయవంతంగా ముగిసింది. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో తొలిసారి ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శ్రీనగర్‌ (Srinagar)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దులో భద్రతా ఏర్పాట్లో సమీక్షించారు. అనంతరం బదామీ బాగ్ కంటోన్మెంట్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన సైనికులు, పహల్గాం (Pahelgam) ఉగ్ర దాడిలో మరణించిన పౌరులకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు.

యుద్ధ వాతావరణంలో సైనికుల ధైర్య సాహసాలు మరువ లేవనివని అన్నారు. గాయపడిన త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా జమ్మూకశ్మీర్ తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. రాబోయే రోజుల్లో ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నా.. వాటిని సమూలంగా నాశనం చేస్తామని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని అంతం చేయడానికి ఎంత దూరమైనా.. ఎక్కడికైనా వెళ్తామని కామెంట్ చేశారు. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడి జరిగితే.. అది యాక్ట్‌ ఆఫ్‌ వార్‌ (Act Of War)గానే పరిగణిస్తా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాద నిర్మూలన, POK అప్పగింతపైనే అని స్పష్టం చేశారు. ఇండియన్ ఆర్మీని రెచ్చగొడితే ఎలా ఉంటుందో.. పాక్‌కు తెలిసి వచ్చిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Next Story