- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షణంలో పాకిస్తాన్‌ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం.. CM రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
భారత సైన్యం(Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) మిషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత సైన్యం(Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) మిషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం నెక్లెస్ రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని.. మిగతా సమయాల్లో మేమంతా ఒక్కటే.. అందరం భారతీయులం అని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో కేంద్రానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జవాన్లకు అండగా నిలిచేందుకు తామంగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు మన సైన్యం గట్టి సమాధానం ఇచ్చిందని అన్నారు. పాకిస్తాన్(Pakistan)కు స్వాతంత్ర్యం ఇచ్చిందే తాము అని.. మనం తల్చుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడానికి ఎంతో సమయం పట్టదని కీలక వ్యాఖ్యలు చేశారు.
మా దేశ సిందూరాన్ని మీరు తుడిచేయాలని అనుకుంటే.. ఆపరేషన్ సిందూరే మీకు సమాధానం అని అన్నారు. మాకు బలం, బలగం రెండూ ఉన్నా.. సంయమనం పాటిస్తున్నామని.. మరోసారి ఇది రిపీట్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని పాకిస్తాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పాకిస్తాన్ వక్రబుద్ధి మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాద చర్యలు ఎవరూ ఉపేక్షించరని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దన్నారు. హైదరాబాద్‌లోని రక్షణరంగ సంస్థల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.






