- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా పాక్ వార్..పంజాబ్ పొలాల్లో పాక్ మిస్సైల్ శకలాలు
ఇండియా పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతోంది. గురువారం రాత్రి పాకిస్థాన్ ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతోంది. గురువారం రాత్రి పాకిస్థాన్ ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులను ఇండియన్ ఆర్మీ, నేవీ సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలోనే పంజాబ్ సరిహద్దుల్లోని పొలాల్లో మిస్సైల్ శకలాలు రాలిపడ్డాయి. పంజాబ్లోని శహ్పూర్ గ్రామం బాటాలలో ఓ రైతు తన పొలంలో మిస్సైల్ శకాలాన్ని గుర్తించాడు.
గురువారం రాత్రి భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయని చెప్పాడు. ఉదయం తన పొలానికి వచ్చి చూస్తే భారీ లోహపు వస్తువు కనింపించిందని చెప్పాడు. దానిని గమనించిన పోలీసులు మిస్సైల్ శకలంగా గుర్తించారు. ఆర్మీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే పాక్ గురువారం రాత్రి వరుస పెట్టి డ్రోన్ మరియు మిస్సైల్ దాడులు చేసింది. ఆ దాడులను భారత క్షిపణులు నేలమట్టం చేయడంతో సరిహద్దు రాష్ట్రాల్లో అక్కడక్కడా మిస్సైల్ శకలాలు పడిపోయాయి.






