ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా పోస్ట్.. ప్రొఫెసర్ అలీ ఖాన్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్

by Malleboina Mahesh |

కశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ భారత దేశం ఉలిక్కిపడింది.

ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా పోస్ట్.. ప్రొఫెసర్ అలీ ఖాన్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లోని పహల్గామ్‌ (Pahalgam)లో టూరిస్టులపై పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు దాడి (Attack by terrorists) చేసి 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ భారత దేశం ఉలిక్కిపడింది. దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతం చేసేందుకు భారత త్రివిధ ధళాలకు పూర్తి స్వేచ్చను ఇవ్వగా.. భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో తొమ్మది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ దాడిని భారత దేశవ్యాప్తంగా విజయంలా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా పోస్టులు (Posts against Operation Sindoor) పెట్టారు.

దీంతో అలాంటి వారిపై అన్ని రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయం (Ashoka University) ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి అయిన అలీ ఖాన్ మహ్మదాబాద్ (Ali Khan Mohammadabad)ను అరెస్టు చేశారు. అయితే అతను తనను బెయిల్ (Bail) ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారించిన కోర్టు.. అలీ ఖాన్ మహ్మదాబాద్ ను అరెస్ట్ నుండి విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. సోనిపట్ లోని CJM సంతృప్తి చెందేలా బెయిల్ బాండ్లను సమర్పించిన తర్వాత మహ్మదాబాద్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో ఉన్న రెండు పోస్టులకు సంబంధించి ఎటువంటి ఆన్‌లైన్ వ్యాసం రాయకూడదని, ఎటువంటి ఆన్‌లైన్ ప్రసంగం చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story