- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేగమే ఆయుధం.. ఇందుకే భారత మిసైళ్లను పాక్ అడ్డుకోలేకపోయింది?
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పొయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పొయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుపడింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవారులు హతమయ్యారు. అయితే, ఇక్కడే పాకిస్థాన్ నీచపు బుద్ది బయటపడింది. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంపులే లేవని కబుర్లు చెప్పిన పాక్.. చనిపోయిన టెర్రరిస్టులకు అధికార లాంఛనాలతో నిర్వహించింది. అనంతరం ప్రతీకార చర్యకు దిగి.. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులుకు పాల్పడింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఇక యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా కీలకం. ఇందులో క్షిపణి నిరోధక వ్యవస్థలు అలాగే రాడార్లు, దాడికి దిగే విమానాలను గుర్తించి, ట్రాక్ చేసే ఇతర పరికరాలు ఉంటాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ అనే బాంబులను వినియోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేవలం 25 నిమిషాల్లో భారత్ ప్రయోగించిన క్షీపణులు తమ టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. అయితే, భారత వైమానిక దళం అంతర్జాతీయ సరిహద్దు దాటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినా పాకిస్తాన్ నిఘూ వ్యవస్థ ఏం చేయలేక పోయింది. పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఇండియన్ మిస్సేల్స్ ఎదుర్కొలేక పోయింది. భారత క్షిపణుల్ని, డ్రోన్లను అడ్డుకుని కూల్చివేయలేకపోయింది.
రేడియో పాకిస్తాన్ చెప్పిన దాని ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక రక్షణ సామర్థ్యాలలో అడ్వాన్స్డ్ ఏరియల్ ప్లాట్‌ఫామ్స్, హై టు మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం (HIMADS), అన్మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికిల్స్ ఉన్నాయని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. వీటితో పాటు, స్పేస్, సైబర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టంలు కూడా ఉన్నాయి. అయితే, భారత్ మిసైళ్లను పాకిస్థాన్ అడ్డుకోలేకపోవటంతో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంకు స్వల్ప-శ్రేణి, మధ్యస్థ-శ్రేణి, దీర్ఘ-శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉందని పాక్ ఎయిర్‌ఫోర్స్ మాజీ వైస్ ఎయిర్ మార్షల్ ఇక్రముల్లా భట్టి తెలిపారు. అయితే, గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్స్‌ను అడ్డుకునే రక్షణ వ్యవస్థ అందుబాటులో లేదని వెల్లడించారు. గగనతలం నుంచి భూమికి మిసైల్ దాడులను 100 శాతం ఆపడం అసాధ్యమని ఆయన అంటున్నారు. ఇక భారత్ ప్రయోగించిన మిసైల్స్ వేగం మాక్ 3 (గంటకు 3,675 కి.మీ) నుంచి మాక్ 9 (గంటకు 11,025 కి.మీ) వరకు మారింది. వేర్వేరు దిశల నుంచి గగనతలం నుంచి భూమికి ఒకేసారి మిసైల్స్ ప్రయోగిస్తే, వాటిని రాడార్‌లో గుర్తించడం, వెంటనే స్పందించడం కష్టమని అన్నారు.






