పాకిస్థాన్ హీరోయిన్ వద్దు.. 'సనమ్ తేరీ కసమ్' చిత్రయూనిట్ సంచలన ప్రకటన

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమ‌నే స్థాయిలో వివాదం రాజుకుంది. పహ‌ల్గామ్ ఘటనతో భారత్ పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాకిస్థాన్ హీరోయిన్ వద్దు.. సనమ్ తేరీ కసమ్ చిత్రయూనిట్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమ‌నే స్థాయిలో వివాదం రాజుకుంది. పహ‌ల్గామ్ ఘటనతో భారత్ పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం చేసింది. ఆదేశ ఆర్మీ స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ కూడా ఇండియాలోని సరిహద్దు గ్రామాలపై డ్రోన్ దాడులు చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆ దేశం నుండి ఎగుమతి దిగుమతులను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఏ అంశాన్ని అయినా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రానే ఆసక్తికర ప్రకటన చేశారు. సోషల్ మీడియా పోస్టులో తన సినిమాలో విదేశీయులను తొలగిస్తేనే అందులో నటిస్తానని చెప్పాడు. హర్షవర్ధన్ ప్రస్తుతం సనమ్ తేరి కసమ్ పార్ట్ 2లో నటిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్ నటి మావ్రా హొకెన్ నటించింది. దీంతో ఆ హీరోయిన్‌ను తొలగించాలని హర్షవర్ధన్ డిమాండ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక తాజాగా చిత్రాయూనిట్ సైతం సినిమా నుండి పాకిస్తాన్ హీరోయిన్‌ని తప్పిస్తున్నట్టు ప్రకటించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశమే తమకు ముఖ్యం అంటూ ప్రకటనలో పేర్కొంది. ఏ రూపంలో అయినా ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తామని పేర్కొంది. హీరో మరియు సినిమా బృందం తీసుకున్న నిర్ణయంపై కొంతమంది ప్రశంసిస్తుంటే మరి కొంతమంది విమర్శిస్తున్నారు.

Next Story