ఆగిపోయిన ఇండియా- పాక్ వార్....రష్యాకు క్యూ కడుతున్న దేశాలు !

by velandi.Saikiran |

భారత్ ( India), పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రష్యా కు ( Russia) మంచి డిమాండ్

ఆగిపోయిన ఇండియా- పాక్ వార్....రష్యాకు క్యూ కడుతున్న దేశాలు !
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ ( India), పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రష్యా కు ( Russia) మంచి డిమాండ్ పెరుగుతుంది. దీనికి కారణం ఇండియా వాడుతున్న S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్. ఈ S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ దెబ్బకు పాకిస్తాన్ డ్రోన్లు ( Pakisthan Drones) అన్ని చిత్తుచిత్తు అయ్యాయి. పాకిస్తాన్ తమ ఆయుధాలు అన్నిటిని... కోల్పోయింది. దీనంతటికి కారణం రష్యా ( Russia) దేశం తయారుచేసిన S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ మాత్రమే.

ఈ S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ దెబ్బకు చైనా అలాగే టర్కీ దేశాలకు సంబంధించిన ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. తునాతునకలైపోయాయి. ఓవరాల్ గా పాకిస్తాన్ పై ఇండియా యుద్ధం గెలిచిందని చెప్పవచ్చు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో.... ఇండియా కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. రష్యా తయారు చేసిన S 400 మిస్సైల్ ( Air Defense Missile సిస్టం ) ఆయుధాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఆఫ్రికన్ దేశాలు మొత్తం ఇప్పుడు రష్యా దగ్గరికి వెళ్తున్నాయని ఈ సమాచారం అందుతుంది. ఇండియాకు ఇచ్చిన S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ తమకు కూడా ఇవ్వాలని అంతర్జాతీయ దేశాలు ఆర్డర్స్ పెట్టుకుంటున్నాయని తెలుస్తోంది. వీటితోనే ఇండియా గెలవడంతో... రష్యాకు మంచి డిమాండ్ పెరిగింది అని అంటున్నారు.


Next Story