జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి తక్షణసాయం కింద రూ. 5లక్షలు

by Ajay Maddhiboyina |

జమ్మూ కాశ్మీర్‌లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు.

జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి తక్షణసాయం కింద రూ. 5లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి సవిత మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రాబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తక్షణ సాయం కింద రూ.5 లక్షల చెక్కును బాధిత సైనికుడి కుటుంబానికి అందజేశారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా సైనికుడి కుటంబాన్ని ఫో‌న్‌లో పమార్శించారు. నేను ఎల్ల వేళలా మీ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Next Story