- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ అభిమానుల గొప్ప మనసు.. భారత ఆర్మీకి భారీ విరాళం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) అభిమానులు గొప్ప మనసు చాటుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) అభిమానులు గొప్ప మనసు చాటుకున్నారు. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న భారత ఆర్మీ(Indian Army) రక్షణ నిధికి జనసేన యూకే నేతలు, రామ్ చరణ్ యూకే అభిమానులు ఒక్కొక్కరు లక్ష చొప్పున అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రామ్ చరణ్ లండన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం(Madame Tussauds Museum)లో చరణ్ మైనపు విగ్రహం నిమిత్తం లండన్(London)ను వెళ్లారు. విగ్రహావిష్కరణ అనంతరం అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా వారు విరాళాలు ప్రకటించారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చోటుదక్కించుకున్న మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా పాల్గొన్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie)తో రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నారు. వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://x.com/JspBVMNaresh/status/1921779159824482336






