- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajnath singh: మా పౌరులను చంపిన వారినే అంతమొందించాం.. రాజ్‌నాథ్ సింగ్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (Pok) లో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌లో భాగంగా మా పౌరులను చంపేసినవారినే అంతమొందించామని, పాక్ పౌరులను టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. భారత సాయుధ దళాలు ఖచ్చితత్వం, అప్రమత్తత సున్నితత్వంతో వ్యవహరించాయని, నిర్దేశించిన లక్ష్యాలను సరైన టైంలో ధ్వంసం చేశారని తెలిపారు. సైన్యం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని కొనియాడారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చేపట్టిన 50 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్ నాథ్ ప్రసంగించారు. ఆపరేషన్ విజయవంతం చేసిన సాయుధ బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు.
మా భూమిపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే శిబిరాలను నాశనం చేశామని, అమాయక పౌరులను టార్గెట్ చేయలేదన్నారు. ఉగ్రవాదుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో వారి శిబిరాలు, మౌలిక సదుపాయాలకే పరిమితం చేశామన్నారు. సైన్యానికి పూర్తి మద్దతు అందించిన ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. అశోక్ వాటికను నాశనం చేసేటప్పుడు హనుమంతుడి ఆదర్శాన్ని తాము అనుసరించామన్నారు. ఎంతో ఆచరణతో పక్కాగా ఆపరేషన్ చేశామన్నారు.






