- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajasthan: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్.. సరిహద్దులు మూసివేత
పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్‌లు అప్రమత్తమయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్ (Rajasthan), పంజాబ్ (Panjab) లు అప్రమత్తమయ్యాయి. దాయాది వైపు నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో అలర్ట్ అయ్యాయి. పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయడంతో పాటు బహిరంగ సభలను నిషేధించాయి. సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్టు రాజస్థాన్ అధికారులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే కాల్పులు జరపాలని సరిహద్దు భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ హైఅలర్ట్ విధించారు. సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలు మూసి వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లు తెరవొద్దని ఆర్డర్స్ ఇచ్చారు.
ఉద్రిక్తతల వేళ భారత వైమాణిక దళం సైతం అప్రమత్తమైంది. జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను మే 9 వరకు నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు యాక్టివేట్ చేశారు. సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌లు గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు గస్తి నిర్వహిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలు కూడా హై అలర్ట్‌లో ఉన్నాయి. అత్యవసర ప్రతిస్పందన కోసం తరలింపు ప్రణాళికలు అమలులో ఉన్నాయి. సరిహద్దు సమీపంలో డ్రోన్ వ్యవస్థలను సైతం ఆక్టివేట్‌లో ఉంచారు. కాగా, పహెల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.






