- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి
పాకిస్తాన్(Pakistan) శుక్రవారం అర్థరాత్రి మరోసారి డ్రోన్ల దాడి(Drone Attack)కి దిగింది.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్(Pakistan) శుక్రవారం అర్థరాత్రి మరోసారి డ్రోన్ల దాడి(Drone Attack)కి దిగింది. జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో రెచ్చిపోగా.. భారత్ వాటిని ధీటుగా తిప్పి కొట్టింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు LOC వెంట.. సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొర, జమ్ము, సాంబా, పఠాన్ కోట్, అమృత్ సర్, ఫిరోజ్ పూర్, హోషియార్ పూర్, గురుదాస్ పూర్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ శుక్రవారం అర్థరాత్రి డ్రోన్ దాడులకు పాల్పడినట్టు ఇండియన్ ఆర్మీ(Indian Army) వర్గాలు, డిఫెన్స్ మినిస్ట్రీ(Defence Ministery)వర్గాలు వెల్లడించాయి.
శ్రీనగర్ ఎయిర్పోర్టు పై కూడా దాడి ప్రయత్నం జరిగినట్టు తెలిపాయి. అయితే ఈ దాడులను తిప్పి కొడుతున్నామని, భయపడాల్సిన పని లేదని పేర్కొన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ ఔట్ కొనసాగుతుండగా... ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.






