ఆపరేషన్ సిందూర్: మరో పాక్‌ గూఢచారి దేవేంద్రసింగ్‌ అరెస్ట్‌

by Malleboina Mahesh |

కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది.

ఆపరేషన్ సిందూర్: మరో పాక్‌ గూఢచారి దేవేంద్రసింగ్‌ అరెస్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్: కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్రిక్త వాతావరణ నెలకొంది. కాగా ఈ పరిస్థితుల్లో భారత సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ బృందాలు వివిధ ప్రాంతాల్లో పలువురు గూడఛారులను అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరో పాక్‌ గూఢచారి (Pakistani spy) దేవేంద్రసింగ్‌ ను అరెస్ట్‌ హరియాణలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల దేవేంద్ర సింగ్, మస్త్‌గఢ్ గ్రామ నివాసి, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.

దేవేంద్ర సింగ్ పాకిస్తాన్ గూఢచార (Intelligence) సంస్థలతో సన్నిహితంగా పనిచేస్తూ.. భారతదేశంలో సున్నితమైన సమాచారాన్ని సేకరించి పాక్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అతని కార్యకలాపాలు జాతీయ భద్రతకు ముప్పు గా మారే అవకాశం ఉంది. కైథల్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. దేవేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతని కమ్యూనికేషన్ ఛానల్, సంబంధాలపై లోతైన విచారణ కొనసాగుతోంది. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకొని బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. హనీట్రాప్ (Honeytrap) ద్వారా దేవేంద్ర సింగ్‌ను పాకిస్తాన్ నిఘాసంస్థ ISI తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

Next Story