Oparation sindoor: ఉగ్రవాదులను పరామర్శించిన పాక్ ఆర్మీ ఆఫీసర్..భారత్‌కు వార్నింగ్

by Ajay Maddhiboyina |

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత ఆర్మీ బుద్ధి చెబుతోంది. మంగళవారం అర్దరాత్రి దాటిన

Oparation sindoor: ఉగ్రవాదులను పరామర్శించిన పాక్ ఆర్మీ ఆఫీసర్..భారత్‌కు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత ఆర్మీ బుద్ధి చెబుతోంది. మంగళవారం అర్దరాత్రి దాటిన తరవాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. పీఓకేలోనూ ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాద నేతలు హతం అయినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ గుట్టుగా కాకుండా బహిరంగంగానే వారి మద్దతు ఎలా ఉందో చూపిస్తోంది.

తాజాగా భారత్ మెరుపు దాడిలో గాయపడిన ఉగ్రనేతలను, ఉగ్రవాదులను పాకిస్థాన్ ఆర్మీ సీనియర్ అధికారి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బహల్పూర్ ఆస్పత్రికి వెళ్లి ఉగ్రవాదుల ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. మరోవైపు జైషై మహ్మద్ ప్రధాన కార్యాలంపై దాడి చేసిన తరవాత కొందరు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైషే వస్తోంది... నీకు చావు వచ్చింది భారత్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక పార్టీ ఆర్మీ ఉగ్రవాదులను పరామర్శిస్తుండటంతో ఆ దేశం ఉగ్రవాదులకు ఎలా మద్దతు ఇస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది.

Next Story