- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ కామెంట్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు
భవిష్యత్‌లో పాక్ వ్యవహారశైలిలో తేడా వస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోడీ తన ప్రసంగంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భవిష్యత్‌లో పాక్ వ్యవహారశైలిలో తేడా వస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోడీ తన ప్రసంగంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా మోడీ ప్రసంగంపై పాకిస్థాన్ విదేశాంగశాఖ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతున్నవేళ మోడీ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతను పెంచే విధంగా ఉన్నాయని పేర్కొంది. కాల్పుల విరమణను తామే కోరినట్టు చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలో పడేసేలా ఉన్నాయని అభిప్రాయపండింది.
కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉంటామని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పై చేసిన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం వాణిజ్యం- ఉగ్రవాదం- చర్చలు ఒకేసారి సాధ్యం కావని అన్నారు. ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవని వ్యాఖ్యానించారు. అణుబాంబు బెదిరింపులను భారత్ సహించదని, ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకనే పాకిస్థాన్ కాల్పుల విరమణ చేసుకుందామని కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు.






