- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BSF: పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ రిలీజ్
బీఎస్ఎఫ్ జవాన్‌ను భారత్‌కు పాక్ అప్పగించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న బీఎస్ఎఫ్ జవాన్ (BSF soldier) పూర్ణం కుమార్ సాహు ను (Purnam Kumar Shaw) ఆ దేశం విడుదల చేసింది. 20 రోజుల తర్వాత ఆయనను క్షేమంగా వదిలిపెట్టింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు అటారీ సరిహద్దు వద్ద పాక్ భారత్ కు అప్పగించింది. అప్పగింత ప్రక్రియ అంతా శాంతియుతంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగిందని సరిహద్దు భద్రతా దళం ప్రకటన చేసింది. పహెల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 23న ఫిరోజ్ పూర్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తుండగా పూర్ణమ్ కుమార్ షా పొరపాటున బార్డర్ క్రాస్ చేసి తమ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో అతడిని పాకిస్తాన్ (Pakistan) అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి సాహు పాక్ కస్డటీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని విడిపించేందుకు భారత్ పాక్ తో సంప్రదింపులు జరిపింది. అయితే ఆపరేషన్ సిందూర్, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగింది. చివరకు ఇవాళ భారత్ కు అప్పగించింది. సాహు క్షేమంగా తిరిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






