Operation Sindoor: ట్రంప్ కు అది అలవాటే.. ఆయన మాటలు ఇండియన్స్ నమ్మకండి.. అమెరికన్ మాజీ ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

భారత్ దెబ్బకు పాక్ కుక్కలా దారికొచ్చిందని పెంటగాన్ మాజీ ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Operation Sindoor: ట్రంప్ కు అది అలవాటే.. ఆయన మాటలు ఇండియన్స్ నమ్మకండి.. అమెరికన్ మాజీ ఆఫీసర్  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కాల్పుల విరమణ కోసం (ceasefire) భయపడిన కుక్కలా పాకిస్తాన్ (Pakistan)పరిగెత్తుకుంటూ వచ్చిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ (Michael Rubin) సంచలన వ్యాఖ్యలు చేశారు. పహెల్గాం ఉగ్రదాడి ప్రతీకారంలో భారత్ దౌత్యపరంగా, సైనిక పరంగా విజయం సాధించిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇన్ స్టిట్యూట్ లో సీనియర్ ఫెలో ఉన్న ఉన్న రూబిన్ తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడు అందరి దృష్టి పాక్ ఉగ్రవాద స్పన్సర్ షఇప్ పై ఉందన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు యూనిఫాం లో ఉన్న పాక్ ఆర్మీ అధికారులు హాజరు అయ్యారని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ లో పాక్ ఘోరంగా ఓడిపోయింది. అయినా తామే గెలిచామని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

ట్రంప్ కు అది అలవాటే:

భారత్-పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) చేసిన వ్యాఖ్యలపై రూబిన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రతి దానికి క్రెడిట్ తీసుకోవడం ట్రంప్ కు అలవాటే ననిఆయన వ్యాఖ్యలను అమెరికన్ల మాదిరిగా భారతీయులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ట్రంప్ ను అడిగితే ఒంటి చేత్తోనే ప్రపంచ కప్ గెలిచానని చెప్పుకుంటాడు. నేనే ఇంటర్నెట్‌ను కనుగొన్నానని క్యాన్సర్‌ను నయం చేశానని చెప్పుకుండాటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్- పాక్ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా అమెరికా తెరవెనక మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తోందన్నారు.

Next Story