Indian Army - LOC : కాల్పులతో రెచ్చిపోయిన పాక్... 15 మంది భారత పౌరులు మృతి

by Muthe.Rajitha |

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత ఆర్మీ(Indian Army) మంగళవారం అర్థరాత్రి "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 80 మంది ముష్కరులను అంతమొందించింది.

Indian Army - LOC : కాల్పులతో రెచ్చిపోయిన పాక్... 15 మంది భారత పౌరులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత ఆర్మీ(Indian Army) మంగళవారం అర్థరాత్రి "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 80 మంది ముష్కరులను అంతమొందించింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అయితే ఈ అకస్మాత్తు చర్యతో ఏం చేయాలో తెలియని పాక్.. సాధారణ భారత పౌరులపై రెచ్చిపోయి కాల్పులకు(Pak Firing) తెగబడింది.

LOC వెంట బుధవారం పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మరణించగా.. 43 మంది తీవ్రంగా గాయపడినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వార్త వెలువడిన అనంతరం పూంచ్(Poonch), తంగ్ధర్ సెక్టార్ల(Tangdhar Sectors)లో పాక్ బలగాలు సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడుతోంది. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక సామాన్యులపై దాడికి దిగడం పట్ల భద్రతా బలగాల అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యకు కూడా త్వరలోనే గట్టిగా బదులు ఇస్తామని హెచ్చరించారు.

Next Story