- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pakistan: పాకిస్థాన్ ఎన్ని దేశాల నుంచి అప్పు తీసుకుందో తెలుసా..? ఒక్కొక్కరి తలపై అంత అప్పా..?

దిశ, వెబ్ డెస్క్: Pakistan: మింగడానికి మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అనే సామెత పాకిస్తాన్ కు బాగా సెట్ అవుతుంది అని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి తెలుసుకోవచ్చు. ఓవైపు పాకిస్తాన్ పూర్తిగా అప్పులతో కూరుకుపోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూర్చునిపోయి ఉంటే ఇలాంటి సమయంలో భారత్ రెచ్చగొట్టి యుద్ధానికి ఆహ్వానిస్తూ కొరివితో తల గోక్కోవడానికి సిద్ధమైపోయింది.
ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైన అప్పులతో మునిగిపోయింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారింది. జీతాలకు సైతం డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో కూడా పాకిస్తాన్ ఇంకా భారత్ ను రెచ్చగొట్టి మరింత సంక్షోభంలోకి కూరుకుపోయేందుకు సిద్ధమవుతోంది. అయితే పాకిస్తాన్ చేతిలో ప్రస్తుతం చెల్లి గవ్వ కూడా లేదని అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థల చుట్టూ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి భారత్ నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" తర్వాత పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల పైన భారత్ చేసిన దాడుల వల్ల, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద స్వర్గంగా బయటపడింది. ఈ దెబ్బతో ప్రపంచంలోని అన్ని దేశాలు పాకిస్తాన్ వైఖరిని తప్పు పడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చి చూసినట్లయితే పాకిస్తాన్ లో పుట్టిన ప్రతి శిశువు తల పైన 86 వేల రూపాయల అప్పు ఉందని అక్కడి సంస్థలు చెబుతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ మొత్తం అప్పుల పైన నడుస్తుందని దాదాపు ఆ దేశ జిడిపిలో 67% అంతా రుణాలే అని నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ పై ఇప్పటికే దాదాపు 21.6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
తాజాగా పాకిస్తాన్ భారత్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వచ్చినట్టు చెబుతూ, IMF సమావేశానికి ముందు అంతర్జాతీయ భాగస్వాముల్ని మరికొంచం అప్పులు కావాలని కోరుతూ ట్వీట్ చేసింది. అనంతరం ఆ ట్వీట్ తాము చేయలేదని తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని బుకాయించింది. నిజానికి పాకిస్థాన్ కు అత్యధికంగా అప్పులు ఇచ్చేది. IMF, వరల్డ్ బ్యాంక్. 2023లో IMF 7 బిలియన్ డాలర్లు, 2024 మార్చిలో 1.3 బిలియన్ డాలర్ల క్లోమేట్ రిసిలియన్స్ ఫండింగ్ ఇచ్చింది.
మరోవైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) 2024 చివరి వరకూ పాకిస్తాన్‌కి మొత్తం 43.4 బిలియన్ డాలర్లు ఇచ్చింది. ప్రస్తుతం 9.13 బిలియన్ డాలర్ల విలువైన 56 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ జనవరిలో పాకిస్తాన్‌తో 20 బిలియన్ డాలర్ల లోన్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 365 ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ 49.6 బిలియన్ డాలర్ల వరకు నిధులు మంజూరు చేసింది.
చైనా డిసెంబర్ 2024 నాటికి 2.42 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. ఎక్కువగా CPEC ప్రాజెక్టుల కోసం అప్పులు ఇచ్చింది. సౌదీ అరేబియా, యూఏఈ, కతార్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల నుంచి కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంది. భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇటీవల మాట్లాడుతూ IMF వద్ద పాకిస్తాన్‌కి ఇచ్చే రుణాలను ఆర్థిక వాస్తవాలను గమనించి నిర్ణయాలు తీసుకోవాలని IMF బోర్డ్‌ను కోరనున్నారు. మరోవైపు పాకిస్తాన్ అభివృద్ధి పేరుతో ఆకలి పేరుతో తీసుకుంటున్న ఈ రుణాలన్నింటినీ సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తుందనే, ఆరోపణలు సైతం ఉన్నాయి.