Asaduddin Owaisi : పాకిస్తాన్ కు ఒవైసీ చురకలు

by Muthe.Rajitha |

పాకిస్తాన్ కు ఏఐఎంఐఎం అధినేత(AIMIM Cheif) అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) మరోసారి చురకలు అంటించారు.

Asaduddin Owaisi : పాకిస్తాన్ కు ఒవైసీ చురకలు
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ కు ఏఐఎంఐఎం అధినేత(AIMIM Cheif) అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) మరోసారి చురకలు అంటించారు. ఇప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pak PM Shehabaz Sharif), ఆర్మీ చీఫ్ మునీర్.. తమ పంజాబ్ ప్రావిన్స్ లోగల రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్(Raheem Yar Khan Airbase) లో విమానాలను ల్యాండ్ చేయగలరా అంటూ ప్రశ్నించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో భాగంగా గత శనివారం భారత బలగాలు పంజాబ్ ప్రావిన్స్ లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిసైల్స్ తో దాడి చేసి, దానిని పూర్తిగా ధ్వంసం చేశాయి.

అయితే పాక్ మాత్రం తమ ఎయిర్ బేస్ లపై ఎలాంటి దాడి జరగలేదని ముందు బుకాయించి.. అనంతరం దాడులు నిజమేనని ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఓవైసీ పాక్ ను ఎద్దేవా చేస్తూ.. అంతా బాగానే ఉంటే మీరు ఆ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవండి అని తన X ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పై తరుచుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Next Story