Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. సంబరాల్లో పాక్ శత్రు దేశాలు

by Muthe.Rajitha |

భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే.

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. సంబరాల్లో పాక్ శత్రు దేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ శిబిరాలు పాకిస్తాన్‌(Pakistan)లోని పంజాబ్ ప్రాంతంలో అహ్మద్‌పూర్ ఈస్ట్, మురిద్కే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లో కోట్లీ, ముజఫరాబాద్, బాగ్ వంటి చోట్ల ఉన్నాయి. ఈ దాడులు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది చనిపోయిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి రివెంజ్‌గా ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. భారత్ ఈ దాడులను కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసిన ఆపరేషన్ అని పేర్కొంది.

ఈ దాడుల్లో 80-90 మంది ఉగ్రవాదులు చనిపోగా.. జైష్-ఎ-మహమ్మద్ లీడర్ మసూద్ అజహర్ కుటుంబంలో 10 మందితోపాటు మరో నలుగురు సన్నిహితులు మరణించారని సమాచారం. పాకిస్తాన్ మాత్రం దీన్ని "వార్ యాక్షన్" గానే భావిస్తున్నామని.. 31 మంది పౌరులు చనిపోయారని, మసీదు వంటి సాధారణ ప్రాంతాలు దెబ్బతిన్నాయని ఆరోపించింది. దీంతో భారత్-పాక్(Bharat-Pak Conflicts) మధ్య ఉద్రిక్తత తారా స్థాయికి చేరింది. అయితే ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల వార్తలతో పాకిస్తాన్ శత్రువులైన ఆఫ్ఘనిస్తాన్(Afghanistan), బలూచిస్తాన్(Balochistan) లు సంబరాల్లో మునిగిపోయాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో పాక్‌తో సరిహద్దు గొడవలు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024-25లో ఇరు దేశాల మధ్య రాకెట్ దాడులు, సరిహద్దు ఘర్షణలు జరిగాయి. భారత్ దాడుల వల్ల పాక్ సైన్యం ఒత్తిడిలో పడటం ఆఫ్ఘన్‌కు లాభమని, సరిహద్దు టెన్షన్ తగ్గుతుందని తాలిబాన్, TTP సానుభూతిపరులు అభిప్రాయపడుతున్నారు. X లో కొందరు ఆఫ్ఘన్ యూజర్లు ఈ దాడులను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు.

ఇక బలూచిస్తాన్‌లో.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి గ్రూపులు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాయి. పాక్ వాళ్ల సహజ వనరులను దోచుకుంటోందని, బలూచ్ ప్రజలను అణచివేస్తోందని వారి ప్రధాన ఆరోపణ. పాక్ పై మార్చిలో జఫ్ఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్, మే 6న నోష్కీలో బాంబు దాడి వంటివి BLA చేసింది. భారత్ దాడులతో పాక్ సైన్యం బిజీ అయితే, బలూచ్ గ్రూపులకు తమ దాడులు తీవ్రం చేయడానికి అవకాశం దొరుకుతుందని సంతోషిస్తున్నట్టు తెలుస్తోంది. X లో బలూచ్ యాక్టివిస్టులు ఈ దాడులను స్వాగతిస్తూ పోస్టులు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్, బలూచ్ గ్రూపులు పాక్‌కు వ్యతిరేకం కాబట్టి.. పాక్ సైన్యాన్ని ఇబ్బంది పెట్టిన ఆపరేషన్ సిందూర్ ను వాళ్లు తమకు అనుకూలంగా భావించి సంబరాలు చేసుకున్నారు.

Next Story