- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్: గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కిరణ్ రిజిజు తెలియజేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సర్వసభ్య సమావేశంలో ఆపరేషన్ సిందూర్ పరిణామాల గురించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్టీల నేతలకు వివరించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కిరణ్ రిజిజు తెలియజేశారు. మే 8న ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్‌లో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ట్వీట్ చేశారు. పెహల్గామ్ దాడికి ప్రతికారంగా 1971 యుద్ధం తర్వాత మొదటిసారి సైనిక దాడిలో భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను నిర్వహించాయి. 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ నేమ్‌తో, భారత సైన్యం, నేవీ, వైమానిక దళం కలిసి బహవల్పూర్ లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం, లాహోర్, సియాల్ కోట్ సమీపంలోని మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా మర్కాజ్ వంటి కీలకమైన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.






