Operation Sindoor: మన సైన్యం వందశాతం విజయం సాధించింది- బీజేపీ

by Shamantha N |

దాదాపు పందొమ్మిది రోజుల తర్వాత భారత్- పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరగలేదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దుల్లో వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది.

Operation Sindoor: మన సైన్యం వందశాతం విజయం సాధించింది- బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు పందొమ్మిది రోజుల తర్వాత భారత్- పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరగలేదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దుల్లో వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది. కాగా.. ఈ పరిణామాల వేళ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) నాయకత్వంపై బీజేపీ ప్రశంసలు కురిపించింది. కాషాయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంబిత్‌ పాత్ర (Sambit Patra) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) వంద శాతం విజయవంతమైందన్నారు. సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. ‘‘మన సైన్యం వంద శాతం విజయం సాధించింది. నియంత్రతతో కూడిన కచ్చితమైన చర్యల ద్వారా పాకిస్థాన్ లోని కీలక ప్రాంతాలను సైన్యం టార్గెట్‌గా చేసుకుంది. పహెల్గాం ఉగ్రదాడితర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ భారత ప్రజలకు హామీ ఇచ్చారు. మోడీ వ్యూహాలు శత్రుదేశం ఊహలకు కూడా అందవు. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం సత్తా చాటింది. ఇది అద్భుత విజయం. పాక్ భూభాగంలోని సుదూర ప్రాంతాలకు దూసుకెళ్లి.. శత్రు దేశ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇది నయా భారత్‌’’ అని ఆయన వివరించారు. ఒక అణ్వాయుధ దేశం లోతుల్లోకి వెళ్లి దాడి చేయడం ఇదే మొదటిసారని వెల్లడించారు.

మోడీ ఎదుట ఐదు లక్ష్యాలు

మరోవైపు, ఆపరేషన్‌ సిందూర్‌ కోసం ప్రధాని మోడీ ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు. ఒకటి శత్రు భూభాగంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లి దాడి చేయడం.. రెండోది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం.. మూడోది వాటిని పూర్తిగా నిర్మూలించడం.. నాల్గోది ఈ ప్రక్రియలో పౌరులకు గాయాలు కాకుండా చూడటం.. ఐదోటి సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయకుండా ఉండటం అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా భారత సైన్యం అద్భుత శక్తిపాటవాలను ప్రదర్శించిందన్నారు. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిందని ప్రశంసించారు.

Next Story