- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Op Sindoor: పాక్ లోని 2.2 కిలోమీటరల్ దూరం చొచ్చుకెళ్లి..
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టింది. కాగా.. ఆపరేషన్ సిందూర్ గురించి సాయుధ దళాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టింది. కాగా.. ఆపరేషన్ సిందూర్ గురించి సాయుధ దళాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆపరేషన్ కు సంబంధించిన విజువల్స్ ని కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ సిందూర్ వివరాలను వివరిస్తూ.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) కూడా ఆ తరహా వీడియోని పంచుకుంది. అందులో మూడు టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసినట్లు చూపించింది. పాక్‌లో 2.2 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు కచ్చితమైన దాడులను నిర్వహించినట్లు వివరించింది. పాక్ ఆర్మీ పోస్టులపై కూడా దాడి చేసి ధ్వంసం (India hit Pak army posts) చేసినట్లు ఆ వీడియోలు ఉంది.
బీఎస్ఎఫ్ ఐజీ..
అయితే, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వీడియోలను జమ్ము ఫ్రంటియర్‌లోని బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ శశాంక్ ఆనంద్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మే 9, 10 తేదీల మధ్య రాత్రి సరిహద్దు సమీపంలో లష్కరే తోయిబాకు చెందిన లూని ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను నాశనం చేశాం. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న మస్త్‌పూర్ అనే మరో లాంచ్‌ప్యాడ్‌ను కూడా ధ్వంసం చేశాం. భారత దళాల దాడులతో పాక్ రేంజర్లు అక్కడి నుంచి పారిపోయారు (Rangers fleeing)’ అని శశాంక్ ఆనంద్ అన్నారు. సరిహద్దుల్లో మన భద్రతా దళాలు పూర్తి ఆధిపత్యం చెలాయించాయని.. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు.






