- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ వార్త సంతోషాన్నిచ్చింది : మధుసూదన్ భార్య
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం భారత ఆర్మీ(Indian Army) మంగళవారం అర్థరాత్రి "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 80 మంది ముష్కరులను అంతమొందించింది. అయితే పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని ఆనందిస్తున్నారు. భారత ఆర్మీ మంచి పని చేసినందని వారు కొనియాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి(Kavali)కి చెందిన మధుసూదన్(Madhusudan) కుటుంబం స్పందించింది. పహల్గాం ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయానని.. ఆపరేషన్ సిందూర్ జరిగిందనే వార్త విని సంతోషం వేసిందని ఆయన భార్య కామాక్షి తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోడీకి, ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని.. తనలాగా ఎవరూ తండ్రిని కోల్పోకూడదని మధుసూదన్ కుమారుడు ముకుంద్ రోధించాడు.






