Operation Sindoor : భారత్- పాక్ ఉద్రిక్తతలు... పేరు మార్చుకున్న మైసూరు పాక్

by Muthe.Rajitha |

భారత్-పాకిస్థాన్(Bharat-Pak Conflicts) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో.. జైపూర్‌లోని 'త్యోహార్ స్వీట్స్'(Tyohar Sweets) అనే ప్రముఖ షాప్ తమ మెనూలోని స్వీట్ల పేర్ల నుంచి "పాక్" అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో "శ్రీ" అనే పదాన్ని జోడించింది.

Operation Sindoor : భారత్- పాక్ ఉద్రిక్తతలు... పేరు మార్చుకున్న మైసూరు పాక్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాకిస్థాన్(Bharat-Pak Conflicts) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో.. జైపూర్‌లోని 'త్యోహార్ స్వీట్స్'(Tyohar Sweets) అనే ప్రముఖ షాప్ తమ మెనూలోని స్వీట్ల పేర్ల నుంచి "పాక్" అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో "శ్రీ" అనే పదాన్ని జోడించింది. ఈ నిర్ణయం దేశభక్తి స్ఫూర్తితో తీసుకున్నామని షాప్ యజమాని అంజలి జైన్ తెలిపారు. వీరి మెనూ ప్రకారం.. మైసూరు పాక్(Mysore Pak) ఇకపై మైసూరు శ్రీ(Mysore Sri)గా, మోతీ పాక్-మోతీ శ్రీగా, ఆమ్ పాక్-ఆమ్ శ్రీగా, గోండ్ పాక్-గోండ్ శ్రీగా, స్వర్ణ భస్మ పాక్-స్వర్ణ భస్మ శ్రీగా, చందీ భస్మ పాక్-చందీ భస్మ శ్రీగా పేరు మార్చబడ్డాయి. అయితే "పాక్" అనే పదం కన్నడలో చక్కెర సిరప్‌ను సూచిస్తుంది.

అలాగే సంస్కృతంలో "పాక" అంటే "వండడం" అని అర్థం. పాక్ అనే పదానికి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఇటీవలి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ మార్పు చేయాలని నిర్ణయించినట్లు అంజలి జైన్ వెల్లడించారు. త్యోహార్ స్వీట్స్ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు మైసూరు పాక్‌ను "మైసూరు భారత్"గా మార్చాలని సూచించారు. స్వీట్ షాప్ నిర్వహకుల నిర్ణయాన్ని కొందరు దేశభక్తిగా ప్రశంసించగా, మరికొందరు ఇది అనవసర రాజకీయ డ్రామా అని విమర్శించారు.

Next Story