- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock Drill : హైదరాబాద్ లో ముగిసిన మాక్ డ్రిల్
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహించాయి డిఫెన్స్ బృందాలు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహించాయి డిఫెన్స్ బృందాలు. కాగా తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad) లోని 4 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ ముగిసింది. 'ఆపరేషన్ అభ్యాస్'(Operation Abhyas) పేరుతో నిర్వహించిన ఈ డ్రిల్ లో NDRF, SDRF, డిఫెన్స్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు జీహెచ్ఎంసీ(GHMC)లోని పలు ప్రాంతాలతోపాటు, హైదరాబాద్ లోని ప్రధాన జంక్షన్లలో డ్రిల్ సైరన్ మోగింది. యుద్ధ పరిస్థితుల్లో, అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించగా.. కమాండ్ కంట్రోల్ సెంటర్(Commond Control Center) నుంచి ఉన్నతాధికారులు డ్రిల్ ను పర్యవేక్షించారు.
మొత్తం 24 శాఖల అధికారుల కోఆర్డినేషన్ తో ఈ డ్రిల్ చేపట్టగా.. ఫైరింగ్ జరిగినట్టు శబ్దాలు వినబడటం, టెర్రరిస్టులు కాల్పులు జరపడం, ఒక బిల్డింగ్ లోకి వెళ్ళి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటికి తీసుకురావడం వంటి సంఘటనలను ప్రదర్శించారు. కాగా ఈ మాక్ డ్రిల్ అనంతరం హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, వారిని అప్రమత్తంగా ఉంచడానికి ఈ డ్రిల్ సన్నహక చర్య అన్నారు. ఎవరూ ఎలాంటి భయబ్రాంతులకు గురి కావద్దని పేర్కొన్నారు. పారిశ్రామిక సైరన్లు, పెట్రోలింగ్ వెహికిల్స్, పోలీస్ సైరన్లు మోగించి.. ఎక్కడివారు అక్కడ ఉండాలని సూచించామని, వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించేలా డ్రిల్ చేపట్టామని తెలియజేశారు.






