జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేత

by Ajay Maddhiboyina |

భారత్ టార్గెట్‌గా పాకిస్థాన్ దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇండియా సరిహద్దు ప్రాంతాలనే పాక్ టార్గెట్ చేసుకుంది.

జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేత
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్ టార్గెట్‌గా పాకిస్థాన్ దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇండియా సరిహద్దు ప్రాంతాలనే పాక్ టార్గెట్ చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులు జరుతుండగా మరోవైపు పాక్ డ్రోన్ దాడులు సైతం చేస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్ విమానాశ్రయంలపై రాకెట్ దాడి చేయడంతో పాటూ పలుచోట్ల డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులను ఇండియాన్ ఆర్మీ సమర్దవంతంగా తిప్పికొట్టింది. ఎనిమిది మిస్సైల్స్ ను భారత క్షిపణి S 400 పేల్చివేసింది. అయినప్పటికీ యాంటీ మిస్సైల్ క్షిపణులకు దొరకకుండా పాక్ కొన్ని చోట్ల దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ బ్లాక్ అవుట్‌లో ఉంది. రాజస్థాన్‌‌లోనూ బ్లాక్ అవుట్ ప్రకటించారు.

Next Story