- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను నా తండ్రిలా సైనికురాలినవుతా.. పాకిస్తాన్ పేరు లేకుండా చేస్తా.. వీరజవాన్ కూతురు ఆవేదన
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు భారత సైనికులు వీర మరణం పొందారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (India-Pakistan tensions)భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు భారత సైనికులు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్లో ఆర్ఎస్ పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల్లో విధి నిర్వహణలో ఉండగా సార్జెంట్ సురేంద్ర మోగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సార్జెంట్ సురేంద్ర మోగా (Sergeant Moga) మృతదేహాన్ని రాజస్థాన్, ఝుంఝునులోని మాండవా గ్రామంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, తోటి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక వీరజవాన్ సార్జెంట్ సురేంద్ర మోగా కూతురు మీడియాతో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని చిన్నారి చెప్పింది.
తండ్రి మరణంపై సురేంద్ర మోగా కుమార్తె వర్తిక (Vartika) మాట్లాడుతూ.. ‘నా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉంది. శనివారం రాత్రి నాన్నతో మాట్లడాను.. పాకిస్తాన్ డ్రోన్లు వచ్చాయని చెప్పారు. నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలి పెట్టను.. అందరిని అంతం చేస్తా, నేను కూడా మా నాన్నల సైనికురాలిని అవుతాను. పాకిస్తాన్ పేరును లేకుండా చేయాలి.. అంతం చేయాలి’ అని చిన్నారి వర్తిక ఆవేదన వ్యక్తం చేసింది.






