- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor : పాక్ కాల్పుల్లో భారత మహిళ మృతి
కశ్మీర్లోని సరిహద్దు రేఖ LOC వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది.

దిశ, వెబ్ డెస్క్ : కశ్మీర్లోని సరిహద్దు రేఖ LOC వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. బారాముల్లాలోని ఉరి సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరపడంతో ఓ భారత మహిళ మృతి చెందింది. మరికొంత మంది సాధారణ ప్రజలతో పాటు, ఓ జవానుకు కూడా గాయాలు అయ్యాయి. రాజౌరీ, అక్నూర్, జమ్ము, కుప్వారా జిల్లాల సాధారణ పౌర నివాసాలపై కూడా కాల్పులు జరుపుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ వైపు డ్రోన్ దాడులు, మరోవైపు పాక్ సైన్యం కాల్పులు జరుపుతుండటంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి పాక్ కు తగిన గుణపాఠం చెబుతోంది.
డ్రోన్లను కుప్ప కూల్చడంతో పాటు.. పాక్ కాల్పులకు కూడా ధీటుగా బదులు ఇస్తోంది. LOC వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతాలు రణరంగంగా మారాయి. జమ్ము కశ్మీర్ పూర్తిగా బ్లాక్ ఔట్ లో ఉండగా... ఫిరోజ్ పూర్, అమృత్ సర్, జైసల్మేర్, జలంధర్, ఉరిలో కూడా సంపూర్ణ బ్లాక్ ఔట్ కొనసాగుతోంది.






