POKను పాకిస్తాన్ ఖాళీ చేసి తీరాల్సిందే.. భారత విదేశాంగశాఖ స్వీట్ వార్నింగ్

by Gantepaka Srikanth |

కశ్మీర్ విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత విదేశాంగశాఖ(Indian Foreign Ministry) స్పష్టం చేసింది.

POKను పాకిస్తాన్ ఖాళీ చేసి తీరాల్సిందే.. భారత విదేశాంగశాఖ స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కశ్మీర్ విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత విదేశాంగశాఖ(Indian Foreign Ministry) స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై మరోసారి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీజీఎమ్‌వో కాల్ కోసం విజ్ఞప్తి చేసింది పాకిస్తానే అని స్పష్టం చేశారు. ముందు కాల్పు విరమణ కోరింది కూడా పాకే అని వెల్లడించారు. కశ్మీర్ విధానంలో భారత్ వైఖరిలో మార్పు లేదని.. సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. పీవోకే(POK)ను పాకిస్తాన్(Pakistan) ఖాళీ చేయాల్సిందే అని ఖరాకండిగా చెప్పారు.

ఉగ్రవాదులను అణిచివేయడమే భారత్ ప్రాథమిక లక్ష్యమన్ని పేర్కొన్నారు. తమ పౌరులను బలితీసుకున్న ఉగ్రవాద(Terrorism) స్థావరాలపై తాము దాడి చేస్తుంటే.. పాకిస్తాన్ మధ్యలో దూరి భారత్‌పై దాడికి యత్నించింది. పాక్ దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొంది. పాకిస్తాన్ కాల్పులు ఆపేస్తేనే భారత్ కూడా దాడులు ఆపేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఆపరేషన్ సిందూర్ సమయంలో స్పష్టం చేశాం.. భారత్ చెప్పిన విషయాన్ని పాక్ చెవికి ఎక్కించుకోలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఇకనైనా పాక్ బుద్ధి మార్చుకోవాలి. లేకపోతే భవిష్యత్‌లో మరింత నష్టం తప్పదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story