- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake Alert: భారత మహిళా పైలట్ చిక్కలేదు.. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం
భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా రకాల ఫేక్ వార్తలు పుట్టుకొస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (India-Pakistan) భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా రకాల (Fake Alert) ఫేక్ వార్తలు పుట్టుకొస్తున్నాయి. చాలా వరకు భారత్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని, ఫైటర్ జట్లను కూల్చేసామని పాక్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా పాక్ సోషల్ మీడియాలో భారత వాయుసేన మహిళా పైలట్ పాక్ బలగాలకు చిక్కారని (Indian female pilot caught) ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. పాక్ సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఫేక్ వార్తలపై పీఐబీ స్పందించింది. ఈ వార్తలు అవాస్తవమని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పష్టం చేసింది.
‘భారత మహిళా వైమానిక దళ పైలట్ పట్టుబడలేదు, భారతీయ మహిళా వైమానిక దళ పైలట్, స్క్వాడ్రన్ లీడర్ శివానీ సింగ్ (Pilot Shivangi Singh), పాకిస్తాన్‌లో పట్టుబడ్డారని పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తోంది’ అని పీఐబీ ఎక్స్ వేదికగా తెలిపింది. కాగా, భారత్ మహిళా వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివానీ సింగ్ జెట్ నుంచి పాకిస్తాన్‌లోకి దూకినప్పుడు ఆమెను పట్టుకున్నారని పాక్ దృవీకరించిందని, ఆమె ఒక మహిళా పైలట్ ఆఫీసర్ కాబట్టి, మతం ఇస్లాం మహిళలను గౌరవంగా చూసుకోవాలని మనకు బోధిస్తుందని, భారత వింగ్ కమాండర్ అభినందన్ తర్వాత మరొకరు చిక్కారు అంటూ పాక్ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు క్రియేట్ చేశారు.






