Poonch: పాక్ సైన్యం కాల్పులు.. భారత జవాన్ మృతి

by velandi.Saikiran |

పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేందుకు 'ఆపరేషన్ సిందూర్' ( Operation Sindoor ) చేపట్టిన ఇండియన్ ఆర్మీ ( Indian Army)...

Poonch: పాక్ సైన్యం కాల్పులు.. భారత జవాన్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేందుకు 'ఆపరేషన్ సిందూర్' ( Operation Sindoor ) చేపట్టిన ఇండియన్ ఆర్మీ ( Indian Army)... దాదాపు 100 మందిని చంపేసింది. ఇప్పటికే సినిమా అయిపోలేదని.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ పాకిస్తాన్ కు ( Pakistan) వార్నింగ్ ఇచ్చింది ఇండియా. అయితే ఉగ్రవాదులను చంపినందుకు... పాకిస్తాన్ ప్రభుత్వం.. అమాయక భారత పౌరులను టార్గెట్ చేస్తోంది.

ఇందులో భాగంగానే... జమ్మూ కాశ్మీర్ లో (Jammu kashmir) ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 31 మందిని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్ ఆర్మీ. ముఖ్యంగా పూంచ్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.

అయితే ఈ కాల్పుల్లో తాజాగా ఓ జవాన్ కూడా మరణించాడు. దినేష్ కుమార్ శర్మ ( Lance Naik Dinesh Kumar Sharma) అనే జవాన్ అమరుడయ్యాడు. మరో 57 మంది సామాన్య ప్రజలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ రేంజర్ల కాల్పులకు ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

Next Story