- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ పై దాడులకు బ్రహ్మోస్ ని వాడిన భారత్..?
భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, శనివారం తెల్లవారుజామున పాక్ భారత్ పై పదుల సంఖ్యలో డ్రోన్లను వాడింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, శనివారం తెల్లవారుజామున పాక్ భారత్ పై పదుల సంఖ్యలో డ్రోన్లను వాడింది. పాక్ దుందుడుకు చర్యలకు ప్రతిగా భారత్ అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్‌ను వాడినట్లు తెలుస్తోంది. వీటితో రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సుక్కుర్, చునియన్, పర్సూర్, సియాల్‌కోట్ స్థావరాలపై భారత్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. అయితే, భాత్ వాడిన వాటిల్లో హ్యామర్ గైడెడ్ బాంబులతోపాటు.. స్కాల్స్ క్షిపణే కాకుండా.. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ ఉండే అవకాశాలున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, యుద్ధ రంగంలో దీన్ని వాడటం ఇదే తొలిసారి కావొచ్చని కథనాల్లో పేర్కొంది. అయితే, అధికారిక వర్గాల నుంచి దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లేదని పేర్కొంది. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
పాక్ వైమానిక స్థావరాలపై దాడి..
అయితే, పాక్ కు చెందిన వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా భారత్ దాడులు చేపట్టింది. ఇకపోతే, పంజాబ్ ప్రావిన్స్‌లోని రఫికీ వైమానిక స్థావరం షోర్కోట్‌లో ఉంది. అత్యాధునిక విమానాలకు ఇది కేంద్రం. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్‌లు ఉన్నాయి. పంజాబ్‌లోని చక్వాల్‌లో మురీద్ ఉంది. పాక్ ఆపరేషనల్ ఫ్లయింగ్ బేస్‌గా దీనికి పేరుంది. దీంతోపాటు మానవ రహిత సాయుధ డ్రోన్లు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా, పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపలోని రావల్పిండిలో చక్లాలా వైమానిక స్థావరం ఉంది. పాక్ కీలక జనరల్స్ ఇక్కడే ఉంటారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కార్యాలయం కూడా చక్లాలాలోనే ఉంటుంది. మరోవైపు, భారత పశ్చిమ సరిహద్దు వెంబడి పౌర ప్రాంతాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలు, యుద్ధ విమానాలను ఉపయోగించిందని అధికారులు చెప్పారు.






