Inida Pakistan War : తిరిగి తెరుచుకున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్

by Muthe.Rajitha |

పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(operartion sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి.

Inida Pakistan War : తిరిగి తెరుచుకున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(operartion sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఎటాక్ దిగగా.. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బ్లాక్ ఔట్ తోపాటు , హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేంద్రం హైఅలర్ట్(High alert in Delhi) ప్రకటించి, ప్రజలు ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ విమానాశ్రయంపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఢిల్లీ ఎయిర్పోర్టును(Delhi Airport) తాత్కాలికంగా మూసి వేసింది. కాగా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రయాణీకుల కోసం మళ్ళీ ఓపెన్ చేశారు. అయితే కొన్ని రూట్లలో మాత్రమే విమానాలను నడుపుతునట్టు ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొన్నాయి.భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరాయి.

Next Story