India Pak War: ఇండియా పాక్ వార్.. రక్తదానం చేసేందుకు తరలివచ్చిన జనాలు

by Prasad Jukanti |

ఇండియా పాక్ వేళ ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు.

India Pak War: ఇండియా పాక్ వార్.. రక్తదానం చేసేందుకు తరలివచ్చిన జనాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ (India Pak War) వాతావరణం నేపథ్యంలో పౌరుల భద్రత విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పాక్ దుస్సాహసాలను తిప్పికొడుతున్న ఇండియన్ ఆర్మీకి దేశ ప్రజలు పెద్ద ఎత్తున జేజేలు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతల వేళ దేశ సైనికులకు అత్యవసర రక్త నిల్వలు అవసరం పడతాయని చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ ఇచ్చిన పిలుపుతో ప్రజలు రక్తదానం చేసేందుకు పెద్దఎత్తున తరలి వచ్చారు. సరిహద్దులో సైనికుళ శరీరాల నుంచే కారే రక్తానికి మా రక్తం ఇచ్చి అండగా నిలుస్తామని చాటి చెప్పేలా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేట్ (Blood Donation) చేసేందుకు భారీ సంఖ్యలో ముందుకు వచ్చారు.

యువత నుంచి భారీ స్పందన:

మరో వైపు యుద్ధం నేపథ్యంలో అవసరం అయితే చండీగఢ్ లో స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు సేవకులు కావాలని స్థానిక అధికారులు పిలుపు నివ్వగా వేలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు తరలివచ్చారు. దేశం కోసం మేము సైతం అంటూ వాలంటీర్ గా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

Next Story