- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ceasefire : కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది భారతే : పాక్ మరో బుకాయింపు
గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆచరణలో మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని 3 గంటలైనా గడవకముందే మరోసారి డ్రోన్లు, కాల్పులతో విరుచుకుపడి పాక్ తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది. కాగా జమ్ము కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు దిగి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇదే విషయాన్ని భారత్ ఎత్తి చూపగా.. కశ్మీర్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందు ఉల్లంఘించిందని భారతేనని మరోసారి బుకాయించింది.
ఇండియన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడటం వల్లే తమ ఆర్మీ నియంత్రణ రేఖ (LoC) వెంబడి కాల్పులు జరిపారని ప్రకటించింది. కాల్పుల విరమణను గౌరవించాలని, నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ భారతదేశాన్ని కోరింది. మరోవైపు పాక్ ప్రధాని షెహబాజ్(Pak PM Shehabaz) కాల్పుల విరమణపై మాట్లాడుతూ.. శాంతిస్తాపన కోసమే సీజ్ ఫైర్ కు ఒకే అన్నట్టు పేర్కొంటూ.. భారత్ తో జరిగిన యుద్ధంలో విజయం తమదేనని ప్రకటించుకున్నారు.






