- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా గేట్ వద్ద హై అలెర్ట్.. భారీగా బలగాలు !
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ.. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రత కారణాల దృష్ట్యా.. ఇండియా గేట్‌ను ఖా

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ.. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రత కారణాల దృష్ట్యా.. ఇండియా గేట్‌ను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. అక్కడ సేద తీరడం, సామూహిక చర్చలు నిర్వహించడానికి నో పర్మిషన్ అంటూ అక్కడి నుంచి అందరిని వెళ్లగొడుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అటు జలంధర్ డిఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు శబ్దాలు వింటున్నారని, వెలుతుర్లు కనిపిస్తున్నాయని నివేదికలు అందాయన్నారు. ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నాం, ఇప్పటివరకు అలాంటివి కనిపించలేదని చెప్పారు. పుకార్లు వ్యాప్తి చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి.. అనుమానాస్పద వస్తువులు కన్పించినా, వాటిని తాకకుండా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు జలంధర్ డిఎస్పీ.
BREAKING NEWS 🚨 India Gate has been COMPLETELY EVACUATED. No one is allowed to stop around India Gate. pic.twitter.com/7lVlWPRwJT
— Times Algebra (@TimesAlgebraIND) May 8, 2025






