Khawaja Asif: మదర్సా విద్యార్థులను వాడుకుంటాం.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Shamantha N |
Khawaja Asif: మదర్సా విద్యార్థులను వాడుకుంటాం.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కుతంత్రాలన్నీ మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. అధికారం కోసం, దాన్ని నిలబెట్టుకునేందుకు తమ పౌరుల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. అందుకు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఖవాజా ఆసిఫ్.. పార్లమెంట్ లో మరోసారి తమ అసలు రంగు బయటపెడ్డారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే మదర్సాలలో చదువుకునే విద్యార్థులను పాకిస్తాన్ భద్రతకోసం వాడుకుంటామన్నారు. "మదర్సాలు లేదా మదర్సా విద్యార్థుల విషయానికొస్తే.. వారు మన రెండవ రక్షణ శ్రేణి అనడంలో సందేహం లేదు. సమయం వచ్చినప్పుడు, అక్కడ చదువుతున్న యువకులను 100 శాతం అవసరమైన విధంగా ఉపయోగిస్తాం" అని అన్నారు. కాగా.. పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అమాయక విద్యార్థులను యుద్ధంలో బలిచేస్తారా అని మండిపడుతున్నారు. విద్యాలయాల పరువుతీసేలా మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నారు.

ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై భారత్ దాడి చేస్తుందని తమకు ముందే తెలుసని, కావాలనే తాము భారత డ్రోన్లను కూల్చి వేయలేదని అన్నారు. తమ స్థావారాల గురించి సమాచారం బయట పెట్టకూడదనే తాము ఆ దాడిని తిప్పి కొట్టలేదని కవర్ చేసుకున్నారు. అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ కు చెందిన 5 ఫైటర్ జెట్స్ ని తాము కూల్చేశామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గొప్పలు చెప్పుకున్నారు. అయితే, అసలు ఆ ఫైటర్ జెట్లను ఎలా కూల్చేశారు, ఏ ఆయుధాలను ఉపయోగించారు, ఏ రక్షణ వ్యవస్థను వాడుకున్నారంటూ సీఎన్ఎన్ న్యూస్ ఛానెల్ యాంకర్ ప్రశ్నించడంతో ఆయన కంగుతున్నారు. తాము నిజంగానే ఫైటర్ జెట్స్ ని కూల్చేశామని సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఉన్నాయి కదా చూస్కోండి అంటూ సమాధానమిచ్చారు. సోషల్ మీడియా వీడియోలు సాక్ష్యాలు ఎలా అవుతాయని యాంకర్ ప్రశ్నించగా.. వాటి శకలాలన్నీ కశ్మీర్ లో పడ్డాయంటూ కబుర్లు చెప్పారు. స్కై న్యూస్ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన మాటలు వైరల్ గా మారాయి. ఉగ్రవాదులకు మద్దతివ్వడమే కాదు, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం, ఆయుధాలు కొనుగోలు చేసి ఇవ్వడంలో పాక్ కి చాలా చరిత్ర ఉందని అంగీకరించారు.



Next Story

Most Viewed