India Pakistan war : యుద్దం వేళ.. పాకిస్థాన్‌కు ₹8,000 కోట్ల బంపర్ ఆఫర్

by Muthe.Rajitha |

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) శుక్రవారం నాడు పాకిస్తాన్‌కు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపింది అని పాక్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

India Pakistan war : యుద్దం వేళ.. పాకిస్థాన్‌కు ₹8,000 కోట్ల బంపర్ ఆఫర్
X

దిశ,వెబ్ డెస్క్ : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) శుక్రవారం నాడు పాకిస్తాన్‌కు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపింది అని పాక్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. "పాకిస్తాన్‌కు IMF నుంచి 1 బిలియన్ డాలర్ల చెల్లింపును ఆమోదించినందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఆ డబ్బును అడ్డుకునేందుకు భారతదేశం చేసిన ఒత్తిడి ప్రయత్నాలు విఫలం అయ్యాయి అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ, దేశం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నదని ప్రకటన వెల్లడించింది. కాగా భారత్ పాక్ మధ్య భారీ యుద్దం జరుగుతున్న నేపథ్యం లో పాకిస్తాన్ కు ఇంత మొత్తం డబ్బు సమకూరడం భారత్ కు ఆందోళన కలిగించే విషయమే. ఆ డబ్బుతో పాక్ ఆయుధాలను కొనుగోలు చేస్తుందని భారత్ భావిస్తుంది.

Next Story