- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ అణ్వాయుధాలను తెరిస్తే.. ఆ దేశం ఉనికే ఉండదు!
గత రెండ్రోజులుగా పాకిస్తాన్- భారత్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటిపోయాక పాక్..

దిశ, వెబెడెస్క్: గత రెండ్రోజులుగా పాకిస్తాన్- భారత్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటిపోయాక పాక్.. తన వద్ద ఉన్న అణ్వాయుధాలు వాడుతుందనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై భారత లెఫ్టినెంట్ రిటైర్డ్ జనరల్ కోన్సమ్ హిమాలయ్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను వాడితే ఆ దేశం ఉనికిలోనే లేకుండా పోతుందని అన్నారు. భారత్ ప్రతిదాడిని పాక్ కలలో కూడా ఊహించదు, తట్టుకోలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయని గత సంవత్సరం స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. అదే సమయంలో భారత్‌లో 172 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నాయని తెలిపింది.






