Kolkata Airport High Alert : కోల్‌కతా ఎయిర్పోర్టులో హైఅలర్ట్

by Muthe.Rajitha |

భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కోల్‌కతా ఎయిర్పోర్టు(Kolkata Airport High Alert)లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు.

Kolkata Airport High Alert : కోల్‌కతా ఎయిర్పోర్టులో హైఅలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కోల్‌కతా ఎయిర్పోర్టు(Kolkata Airport High Alert)లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. మంగళవారం మధ్యాహ్నం కోల్‌కతా లోని సుభాస్ చద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat) కాల్స్ రావడంతో.. విమానాశ్రయంతోపాటు, పరిసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి(Emergency) ప్రకటించారు. కోల్‌కతా నుంచి ముంబై(Kolkata to Mumbai) వెళ్తున్న ఇండిగో విమానం(Indigo Flight)లో బాంబు పెట్టామని, మరికొద్దిసేపట్లో అది పేలి పోతుందని గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయానికి ఫోన్ చేసి చెప్పడంతో ఎయిర్పోర్టు నిర్వాహకులు హైఅలర్ట్ ప్రకటించారు. కొద్దిసేపట్లో టేక్ ఆఫ్ కావాల్సిన విమానాన్ని నిలిపివేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ప్రయాణీకుల లగేజ్ కిందకి దింపి.. విమానాన్ని 'ఐసోలేషన్ బే' ఏరియాలోకి తీసుకువెళ్ళి చెక్ చేయగా.. బాంబ్ వంటివి ఏమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. భారత్-పాక్ యుద్ధం(India Pakistan War) మొదలైన తర్వాత కోల్‌కతా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి బదులుగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతరం దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు భారీ భద్రతను పెంచారు.

Next Story