పాకిస్థాన్‌పై భారత్ దాడిని తీవ్రంగా ఖండించిన హీరోయిన్.. గట్టిన ఇచ్చిపడేసిన హీరో

by Anjali |
పాకిస్థాన్‌పై భారత్ దాడిని తీవ్రంగా ఖండించిన హీరోయిన్.. గట్టిన ఇచ్చిపడేసిన హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: సనమ్ తేరీ కసమ్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో బాగా ఫేమ్ దక్కించుకున్న మావ్రా హోకేన్ ఇటీవలే నటుడు అమీర్ గిలానీని వివాహం చేసుకుంది. పాకిస్తానీ నటి అయిన మావ్రా హోకేన్ బాలీవుడ్‌లో కూడా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ పాకిస్థాన్‌పై భారత్ దాడిని తీవ్రంగా ఖండించారు. పాక్‌కు సపోస్ట్ చేస్తూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టడంతో నెటిజన్లంతా తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ నటి పోస్ట్ పై హీరో హర్షవర్ధన్ రాణే స్పందించి..

‘‘నేను ఈ దేశం, ఆ దేశం, కెన్యా, అంగారక గ్రహంలోని కళాకారులు, మానవులందరినీ గౌరవిస్తాను. కానీ నా దేశం గురించి ఎవరైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు క్షమించరానిది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరులను కోల్పోయినందుకు నేను ఓల్టే.. కానీ అహంకారం, పెంపకంపై నడవడానికి ఎవరినీ అనుమతించరు. మీ దేశానికి అండగా నిలవడం మంచిదే.. కానీ ఇతర దేశం గురించి అగౌరవంగా, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకూడదు’’. అని హీరోయిన్‌కు సోషల్ మీడియా స్టోరీ ద్వారా గట్టిగా ఇచ్చిపడేశాడు.



Next Story