Operation Sindoor : హనుమంతుడి లంకా దహనమే ఆపరేషన్ సిందూర్ కి ఆదర్శం : రాజ్‌నాథ్ సింగ్

by Muthe.Rajitha |

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

Operation Sindoor : హనుమంతుడి లంకా దహనమే ఆపరేషన్ సిందూర్ కి ఆదర్శం : రాజ్‌నాథ్ సింగ్
X

దిశ,వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం భారత ఆర్మీ(Indian Army) మంగళవారం అర్థరాత్రి "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 80 మంది ముష్కరులను అంతమొందించింది. భారత్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ తో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajanath Singh) మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్కడే వెళ్ళి లంకను పూర్తిగా తగులబెట్టి వచ్చిన హనుమంతుడిని(Lanka Dahanam) ఆదర్శంగా తీసుకొని ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని ప్రకటించారు.

ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ సగర్వంగా తలెత్తుకుందని వెల్లడించారు. కచ్ఛితమమైన సమాచారంతోనే నిన్న రాత్రి ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి వారిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. పాక్ పౌరులు తమకు లక్ష్యం కాదని, అమాయకులను చంపిన వారినే అంతం చేశామని అన్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించేది లేదని.. త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కును వినియోగించుకొని ఉగ్రవాదుల స్థైర్యాలను ఘోరంగా దెబ్బతీశామని అన్నారు.

Next Story