Operation Sindoor: రక్షణ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరులో పాక్ కు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

Operation Sindoor: రక్షణ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరులో పాక్ కు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. ఈ అఖిలపక్ష భేటీకి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను కచ్చితంగా ధ్వంసం చేశారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, టీఆర్ బాలు పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్, ఆప్‌ నేత సంజయ్ సింగ్, శివసేన (యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే, బీజేడీ నేత సస్మిత్ పాత్రా, సీపీఐ(ఎం)కి చెందిన జాన్ బ్రిట్టాస్ భేటీలో పాల్గొన్నారు. జేడి(యూ) నాయకుడు సంజయ్ ఝా, చిరాగ్ పాస్వాన్, మజ్లిస్ అధినేతత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి ముందు ప్రధాని మోడీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.

ఆపరేషన్ జరిగిందిలా?

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" గురించి అన్ని పార్టీలకు వివరించిందన్నారు. మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ.. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్ విరుచుకుపడింది. సరిహద్దులు దాటి 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ దాడిలో సాయుధ దళాలు 80 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్‌ మరిచిపోలేదు. ఎక్కడా పాక్‌ సైనిక స్థావరాలపైగానీ, పౌరుల నివాసాలపైగానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకిలించడానికే ప్రాధాన్యమిచ్చింది.

Next Story