Operation Sindoor : నేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు

by Muthe.Rajitha |

భారత్ పాక్(India Pakistan War)మధ్య హోరా హోరీ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

Operation Sindoor : నేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ పాక్(India Pakistan War)మధ్య హోరా హోరీ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్(Soldier Murali Nayak)వీర మరణం పొందాడు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్... జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో అసువులు బాసాడు. శనివారం రాత్రి మురళి పార్థివ దేహాన్ని స్వగ్రామం కల్లితండాకు తీసుకు వచ్చారు.

నేడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించనుంది ఏపీ సర్కార్. మురళి నాయక్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

Next Story