- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manoj mukundhe: ఇది ట్రైలర్.. సినిమా ఇంకా మిగిలే ఉంది.. మాజీ ఆర్మీ ఛీఫ్ సంచలన ట్వీట్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ సిందూర్ (Oparation sindoor) పేరుతో పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ సిందూర్ (Oparation sindoor) పేరుతో పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కీలక ఉగ్రనేతలతో పాటూ వారి స్థావరాలను నేలమట్టం చేసింది.కొందరు ఉగ్రవాదులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసింది. అయితే ఈ మెరుపు దాడుల తరవాత భారత్ తదుపరి చర్యలు తీసుకుంటుందా లేదా అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.
కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందే నరవణే (Manoj mukundhe) ట్వీట్ చేశారు. అబీతో పిక్చర్ బాకీ హై అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని సినిమా ఇంకా మిగిలే ఉంది అని అర్థం అవుతోంది. ఆర్మీ చీఫ్ ట్వీట్‌తో ఇండియన్ ఆర్మీ తరవాత చేయబోయే దాడులు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అన్న ఆసక్తి భారత ప్రజల్లో నెలకొంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం బిక్కు బిక్కుమంటున్నట్టు తెలుస్తోంది. భారత్ మిస్సైల్ దాడుల తరవాత పాక్ ఎలాంటి ప్రతిదాడులకు పాల్పడలేదు. కానీ బార్డర్ నుండి మాత్రం కశ్మీర్‌లోని అమాయకులను టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడుతోంది.






