LOC వద్ద వద్ద భీకర కాల్పులు.. భారీగా ఉగ్రవాదులు హతం

by Muthe.Rajitha |

భారత్-పాక్(India Pakistan War) మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.

LOC వద్ద వద్ద భీకర కాల్పులు.. భారీగా ఉగ్రవాదులు హతం
X

దిశ,వెబ్ డెస్క్ : భారత్-పాక్(India Pakistan War) మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. భారత్ సరిహద్దు రాష్ట్రాలపై పాక్ రాకెట్, డ్రోన్లతో దాడికి దిగింది. వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటూనే.. పాక్ పై ఎదురు దాడికి దిగింది భారత్. ఇస్లామాబాద్,లాహోర్ నగరాలపై వైమానిక, మిసైల్స్ దాడులు చేసింది. కరాచీ ఎయిర్పోర్టుపై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్లోని(Jammu Kashmir) సంబా(Samba) ప్రాంతంలో భారత భద్రతా బలగాలు భారీగా కాల్పులకు దిగాయి.

LOC వెంట చొరబాటుకు ప్రయత్నం చేసిన ఉగ్రవాదులపై ఫైరింగ్ కు దిగారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు భారీగా హతం అయినట్టు తెలుస్తోంది. మరోవైపు పాక్ రేంజర్స్ కూడా భారత జవాన్లపై కాల్పులకు దిగగా.. ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పి కొడుతోంది. పాక్ పై సైనిక చర్యను డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Next Story