- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: నంకానా సాహిబ్ గురుద్వారాపై దాడి.. పాక్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
దాయాది దేశం పాక్ తన బుద్ధిని మార్చుకోవట్లేదు. గురువారం అర్దరాత్రి తర్వాత భారత్ పై దాడులు చేపడితే మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దాయాది దేశం పాక్ తన బుద్ధిని మార్చుకోవట్లేదు. గురువారం అర్దరాత్రి తర్వాత భారత్ పై దాడులు చేపడితే మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. కాగా.. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్నా రాత్రి అయిన తర్వాత మరోసారి భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితికి మతం అనే రంగుని పులిమేందుకు పాక్ పయత్నిస్తోంది. నంకానా సాహిబ్ గురుద్వారాపై డ్రోన్ దాడికి భారత్ గురిపెట్టిందని ఆరోపించింది. అయితే, ఇస్లామాబాద్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఈ వార్తలు ఫేక్ అని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది. "సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో భారత్ నంకానా సాహిబ్ గురుద్వారాపై డ్రోన్ దాడి చేసిందని అంటోంది. అయితే, ఇది ఫేక్ న్యూస్" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) వివరణ ఇచ్చింది. ఆ ఆరోపణలు పచ్చి అబద్ధమని తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కర్తార్‌పుర్ సాహిబ్ నడవాను కేంద్రం మూసివేసిందని గుర్తుచేసింది. భారతదేశంలో మత విద్వేషాన్ని సృష్టించడానికి ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని అది తెలిపింది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ జన్మస్థలమే నంకానా సాహిబ్. అంతేకాకుండా ఆ గురుద్వారా సిక్కులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం.
పాక్ సైబర్ దాడి..
మరోవైపు, పాకిస్తాన్ సైబర్ దాడిలో భారత్ విద్యుత్ గ్రిడ్ పనిచేయకపోయట్లేదనే వార్తలను కూడా కేంద్రం తోసిపుచ్చింది. ముంబై-ఢిల్లీ విమానయాన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిందనే వాదనలను కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ వాదనలు నకిలీవని ప్రభుత్వం తెలిపింది. ఆపరేషన్స్ కారణాల వల్లే విమానాలను తాత్కాలికంగా మూసివేశామని పేర్కొంది. అందుకే ముంబై- ఢిల్లీ పరిధిలోని 25 విభాగాల ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ATS) మార్గాలను తాత్కాలికంగా మూసివేయడాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పొడిగించిందని తెలిపింది.






